Tuesday, April 30, 2024

Apsara: ఈమె ఆమేనా..షాక్ లో నెటిజెన్స్

టాలీవుడ్ లో ఆమె కెరీర్ మొదలుపెట్టి చాలా ఏళ్లు దాటింది. అయినా కూడా గుర్తింపు రాలేదు. ఎప్పడైతే వర్మ.. అప్సర రాణి ఫోటోను షేర్ చేయడం మొదలుపెట్టాడా.. ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేనా ఐటెం సాంగ్స్ తో అదరగొట్టింది. క్రాక్ చిత్రంలో బూమ్ బద్దలు సాంగ్ తో క్రేజ్ తెచ్చుకుంది.

ఇక అమ్మడి సోషల్ మీడియా అకౌంట్ చూస్తే కుర్రాళ్ళ మతులు పోగొట్టుకోవడం ఖాయం. అందాల ఆరబోతకు అసలు సిసలైన బ్రాండ్ అంబాసిడర్ గా అప్సర కనిపిస్తుంది. బికినీ దగ్గరనుంచి టవల్ వరకు.. అమ్మడు ఏ డ్రెస్ ను వదలకుండా అందాలను ఆరబోస్తూనే కనిపించింది. అయితే సడెన్ గా ఆర్జీవీ కలల రాణి.. రూట్ మార్చింది. ఎప్పుడు అందాల ఆరబోత చేసే ఈ ముద్దుగుమ్మ సడెన్ గా చీరకట్టులో కనిపించింది. మేకప్ కూడా మార్చి అచ్చ తెలుగు గృహిణిలా దర్శనమిచ్చింది. ఆమెను చూసి ఇదేంటి ఇది అప్సరనేనా అంటూ షాక్ అవుతున్నారు. ఎంతో పద్దతిగా.. నిండైన తెలుగింటి గృహిణిలా అప్సర కనిపించేసరికి అభిమానులు పెద‌వి విరుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement