Sunday, November 10, 2024

ఎన్టీఆర్ పై మనసు పడ్డ మాజీ హీరోయిన్

దేవి చిత్రంలో తెలుగు వారిని మెప్పించింది మాజీ హీరోయిన్ వనితా విజయ్ కుమార్. సీనియర్‌ నటీనటులు విజయ్‌ కుమార్‌, మంజుల గార్ల కుమార్తె అయిన వనితా.. తమిళంలో బీజీ హీరోయిన్ అయ్యారు. ఇటీవల వరుస పెళ్లిళ్లతో వార్తల్లో నిలిచింది. తాజాగా కమెడీయన్‌ ఆలీ హోస్ట్ చేస్తున్న ఓ షోలో పాల్గొన్న ఆమె.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ షోలోనూ నాలభై పెళ్లిళ్లు చేసుకుంటా అని పేర్కొంది. తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపింది.

తనకు నాగదేవత అంటే చాలా ఇష్టమని, ఆ క్రమంలోనే `దేవి` సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పింది. ఆ సినిమా తర్వాత కూడా తెలుగులో అవకాశాలు వచ్చాయని, కానీ.. తాను ప్రేమలో పడటం వల్ల ఆ సినిమాలు చేయలేకపోయానని వెల్లడించింది. తెలుగు సినిమాల్లోకి రావాలని ఉందని, ఇప్పుడు అవకాశం వస్తే కచ్చితంగా టాలీవుడ్‌లో చేస్తానని తెలిపింది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌కి తాను పెద్ద అభిమానని అని చెప్పింది. ఎన్టీఆర్ తో జీవితంలో ఒక్క షాట్‌ అయినా చేయాలనేదే నా డ్రీమ్‌ అని తన మనసులో మాట చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement