Sunday, April 28, 2024

Satyadev : కృష్ణమ్మ వస్తోంది

సత్యదేవ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వీవి.గోపాలకృష్ణ దర్శకుడు. కొరటాల శివ సమర్పిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే మూడవ తేదీన విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ రా అండ్‌ రస్టిక్‌ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది.

టైటిల్‌ కృష్ణమ్మ అని ఎందుకు పెట్టామో, సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించే సత్యదేవ్‌ ఈ సినిమాతో మరో రేంజ్‌కు చేరుకుంటారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. కాలభైరవ మ్యూజిక్‌ అందిస్తున్నారు. మే 3న సినిమాను విడుదల చేస్తున్నాం అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ స్నేహానికి ఉన్న విలువను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ వేసవికి ఓ మంచి చిత్రం అవుతుంది. అన్నారు. నాయికగా అతీరారాజ్‌ నటిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘు కుంచె, నందగోపాల్‌ ఇతర పాత్రధారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement