Monday, April 29, 2024

బాలీవుడ్ సినిమాలో సత్యదేవ్ !!

యంగ్ హీరో సత్యదేవ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరోకు అద్భుతమైన అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించబోయే సినిమా రామ్ సేతు లో సత్యదేవ్ కీలకపాత్రలో నటించనున్నారట.

లైకా ప్రొడక్షన్స్ సహకారంతో అమెజాన్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రంలోని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నుశ్రత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రంలో సౌత్ నటీనటులను కూడా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. సత్య దేవ్ తో పాటు నాజర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement