Sunday, May 5, 2024

సర్కారు వారి బ్లాస్టర్ మాములుగా లేదు…నయా రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా… తాజాగా నేడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేసింది.

ఈ టీజర్ యూట్యూబ్ లో నయా రికార్డులను బ్రేక్ చేస్తుంది. అతి తక్కువ సమయంలోనే 14 మిలియన్ల ప్లస్ రియల్ టైం యూస్ ను సొంతం చేసుకుంది. అలాగే 600 కే లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా… సీనియర్ నటులు అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement