Friday, December 6, 2024

Saree మేడ‌మ్ ను హీరోయిన్ చేసిన ఆర్జీవి…ఫ‌స్ట్ లుక్ లో శ్రీల‌క్ష్మీ అదుర్స్

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో చెప్పక్కర్లేదు. కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి వీడియోస్ తెగ షేర్ చేశాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?.. తెలిస్తే చెప్పండి అంటూ పోస్టులు చేశాడు. ఆర్జీవి చేసిన పోస్టులు క్షణాల్లోనే వైరలయ్యాయి.. ఆమె అడ్ర‌స్ దొరికింది.. ఏకంగా ఆమెను హీరోయిన్ చేసి శారీ టైటిల్ తో మూవీ తీసేశాడు.

ఇక ఆమె పేరు శ్రీలక్ష్మీ సతీష్.. ఆమెను కథానాయికగా.. ఆమెను ఫోటోస్ తీసిన కెమెరామెన్ అఘోష్ దర్శకుడిగా పరిచయం చేస్తూ శారీ అనే ను తెరకెక్కిస్తున్నారు వర్మ. తాజాగా ఈరోజు ఇంటర్నేషనల్ శారీ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఆర్జీవీ డెన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శారీ ను నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ వర్మ ట్వీట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement