Thursday, May 2, 2024

150 మిలియన్ల వ్యూస్- తగ్గని సారంగదరియా స్పీడ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభించింది. అందులో ముఖ్యంగా సారంగదరియా పాట రికార్డు స్థాయిలో దూసుకు వెళుతోంది.

తాజాగా ఈ పాట మరో రికార్డ్ బ్రేక్ చేసింది. 150 మిలియన్ల వ్యూస్ మార్కును క్రాస్ చేసిన రికార్డును క్రియేట్ చేసింది. ఇక గతంలో సాయిపల్లవి నటించిన వచ్చిందే, రౌడీ బేబీ సాంగ్స్ ఎంతటి సక్సెస్ ను సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాను మేలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే అధికారికంగా మాత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు.

https://twitter.com/adityamusic/status/1385470459978735621?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement