Friday, May 3, 2024

క్రేజ్ తగ్గని సారంగదరియా…

నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. అందులో సారంగదరియా సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉంది. అయితే ఇటీవల విడుదల చేసిన సారంగదరియా సాంగ్ కేవలం మూడు వారాలలోనే 41 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది.

అంతేకాకుండా 7 లక్షలకు పైగా లైక్స్ కూడా సంపాదించుకుంది. మొత్తంగా సారంగదరియా సాంగ్ మాత్రం ఓ రేంజ్ రికార్డులను కైవసం చేసుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సాంగ్ పై వివాదం కూడా నెలకొన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement