Sunday, April 28, 2024

యూట్యూబ్ లో అదరగొడుతున్న సంతోష్ శోభన్ సాంగ్

మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మంచి రోజులు వచ్చాయి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన మెహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా సోసోగా అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సిద్దు శ్రీరామ్ పాడిన ఈ పాట యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే అనూప్ రూబెన్స్ సంగీతం కూడా అదరగొట్టేశాడు. కాగా ఈ పాట ప్రస్తుతం 3 మిలియన్ల ప్లస్ వ్యూస్ ను దక్కించుకుంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది. అలాగే సినిమాపై అంచనాలను కూడా పెంచుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement