Monday, May 6, 2024

సమంత ‘‘శాకుంత‌లం’’ పోస్ట్ పోన్.. త్వ‌ర‌లో కొత్త రిలీజ్ డేట్..

సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ సమంత అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆమె టైటిల్‌ రోల్‌లో నటించిన ‘శాకుంతలం’ మూవీ రిలీజ్ మళ్లీ వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తి కాగా.. ఈ మధ్యే ఓ మోషన్‌ పోస్టర్‌తో రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. గుణశేఖర్ డైరెక్షన్‌‌లో తెరకెక్కిన ఈ మూవీని నవంబర్‌ 4న రిలీజ్‌ చేస్తున్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా శాకుంతలం విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కొత్త తేదీని తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. ఈ సినిమాను 3డీలో అందించాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఆ పనులు చేయడానికి మరికాస్త సమయం పడుతుందని, అందుకే రిలీజ్‌ను వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్‌ ద్వారా తెలిపారు.

“శాకుంతలంతో ఓ గొప్ప అనుభూతిని అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి 3డీ అనేది ఓ గొప్ప మార్గం అవుతుందని టీమ్‌ భావించింది. దీనికోసం మేము మరికొంత సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించాం. దీంతో ముందుకు ప్రకటించిన రిలీజ్‌ డేట్‌కు సినిమాను తీసుకురావడం సాధ్యం కాదు. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు. దీనికి కూడా మీ నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం” అంటూ మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇటీవల రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో సమంత రాకుమారిగా కనువిందు చేసింది. మహాభారతంలోని ఆదిపర్వంలో దుష్యంతుడి శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా స్టోరీని రాసుకున్నారు. దుష్యంతుడి క్యారెక్టర్‌లో మలయాళ హీరో దేవ్ మోహన్ యాక్ట్ చేశారు. తెలుగు, హిందీ, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీగా వర్క్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement