Tuesday, April 30, 2024

Salaar | సలార్‌ కొత్త రికార్డులు.. నాలుగు రోజుల క‌లెక్ష‌న్స్ ఇవే !

ప్రభాస్ సలార్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తొంది. ఫుల్ పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతుంది. నాలుగు రోజులుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఓవర్సీస్, నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా మంచి కలెక్షన్లను రాబడుతోంది.
ఇక ఏపీ, తెలంగాణలోనూ దూకుడుని ప్రదర్శిస్తోంది సలార్ మూవీ. ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు 60 శాతానికి పైగా రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నైజాంలో ఇప్పటికే ఈ మూవీ యాభై కోట్ల షేర్‌ను రాబట్టినట్టుగా మైత్రీ లెక్కల్ని బయటపెట్టేసింది.

నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల కోట్లకు దగ్గరగా వసూళ్లు చేసిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ‘సలార్’ విడుదలైన నాలుగు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 254.87 కోట్ల నెట్ వసూలు చేసింది. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం రూ. 45.77 కోట్ల నెట్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే సలార్ తొలి మూడు రోజుల్లోనే రూ.402 కోట్లు వసూలు చేసినట్లు ఆ మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. నాలుగో రోజు రూ.450 కోట్ల మార్క్ దాటగా.. ఐదో రోజే రూ.500 కోట్ల టార్గెట్ కూడా రీచ్ కానుంది.

ఇక, సలార్ సినిమాలో పాత్రల పేర్లు, ఆ తెగలు, తెగల నాయకులు, వంశ వృక్షాల గురించి క్లారిటీ కోసం మేకర్లు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఆడియెన్స్‌కు అర్థం అయ్యేలా ఓ చార్ట్‌ను కూడా రిలీజ్ చేశారు.

- Advertisement -
YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement