Monday, May 6, 2024

ఎన్టీఆర్ కు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన ను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు చర్చంతా విలన్ గా ఎవరు అనేదానిపై జరుగుతుంది.

కాగా ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను విలన్ గా ప్లాన్ చేస్తున్నారట. సైఫ్ అలీ ఖాన్ ని తీసుకు వస్తే సినిమా రేంజ్ కూడా పెరుగుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటి రాలేదు. అదే కనుక నిజమైతే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు క్రేజ్ పెరుగుతుందనటంలో సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement