Saturday, April 27, 2024

సుకుమార్ నిర్మాణంలో ‘RX 100’ హీరో

‘చావు కబురు చల్లగా’ విడుదలకు ముందే ‘RX 100’ఫేం హీరో కార్తీకేయ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో తన తదుపరి సినిమా తెరకెక్కనుందని అతడు ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారన్న విషయం అతడు చెప్పలేదు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం సుకుమార్ అల్లుఅర్జున్ ‘పుష్ప’ సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ మూవీ ఆగస్టు 13న విడుదల కానుంది.

‘పుష్ప’ పూర్తయిన తర్వాత కార్తీకేయ సినిమాపై సుకుమార్ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ సుకుమార్ నిర్మాతతో పాటు మాటలు, స్క్రీన్‌ప్లే కూడా అందించనున్నాడు. కాగా కార్తీకేయ నటించిన ‘చావు కబురు చల్లగా’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘RX 100’తర్వాత మరో హిట్ కోసం కార్తీకేయ నిరీక్షిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement