Saturday, May 4, 2024

జక్కన్న సమర్పించు ‘జాతిరత్నాలు’

హిట్ టాక్ తో దూసుకుపోతున్న జాతిరత్నాలు సినిమాకు బూస్టింగ్ ఇచ్చారు RRR టీమ్. జాతి రత్నాలు సినిమాలో నవీన్ పొలిశెట్టి.. ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ ఒక గ్యాంగ్ గా ఉంటారు. సినిమా రిలీజ్‌కి ముందు వీరికి సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండయ్యాయి. ఇప్పుడు అలాంటి ఒక ఫొటోని రాజమౌళి,ఎన్టీఆర్, చరణ్ లతో మార్ఫింగ్ చేసి ఆర్ఆర్ఆర్ బృందం జాతి రత్నాలు చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపింది. సినిమా విడుదలకు ముందే జాతిరత్నాల పేరుతో ఓ పోస్టర్ విడుదల చేసింది  సైబరాబాద్ పోలీస్ శాఖ. ఇక నిన్న విడుదలయిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలో కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూన్నాయి.ఇక జాతి రత్నాలు సినిమా ఓవర్సీస్ లోను ప్రేక్షకులను మెప్పించి వసూళ్ళలో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement