Wednesday, April 24, 2024

టైకి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఆర్థిక సాయం – మంత్రి క‌న్న‌బాబు..

కాకినాడ: టైకి ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ప్రభుత్వం తరఫున 10 లక్షలు, కంపెనీ తరఫున 40 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న వారిని హాస్ప‌ట‌ల్లో మంత్రి పరామ‌ర్శించారు.. వారికి అందుతున్న వైద్య స‌హ‌యం గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.. అనంత‌రం క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం లక్ష, కంపెనీ రూ. 3 లక్షలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇక మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇండ్ల స్థలం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాల పక్షాన పరిశ్రమ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు వెల్లడించారు. కాగా, కాకినాడ రూరల్‌ సర్పవరం ఆటోనగర్‌ వద్ద బల్క్‌డ్రగ్స్‌ తయారుచేసే టైకీ పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో సూపర్‌వైజర్లు కాకర్ల సుబ్రహ్మణ్యం(31), తోటకూర వెంకటరమణ(37) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement