Thursday, April 25, 2024

ఈ క్రిస్మస్ కే ఆర్ఆర్ఆర్ విడుదల..? రెండు రోజుల్లో క్లారిటీ..!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర విడుదలపై దేశవ్యాప్తంగా అటెన్షన్ నెలకొంది. ఇప్పటికే విడుదల కావల్సిఉన్న కరోనా నేపథ్యంలో పలు మార్లు షూటింగ్ ఆలస్యం కావడంతో వెయిటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలయిన ప్రచార చిత్రాలు, దోస్తీ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహాంగా వున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేయనున్నారని సమాచారం.

ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి, లేదా సమ్మర్ లో వస్తుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో థియేటర్లకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ సినిమాని క్రిస్మస్ సందర్బంగా తీసుకొచ్చేందుకు సన్నాహలు చేస్తున్నారట. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో ఉన్న రాజమౌళి.. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా పనులు మొదలెట్టారట. సంక్రాంతికి, సమ్మర్ లోను పెద్ద సినిమాల లిస్ట్ బాగానే వుంటటంతో క్రిస్మస్ పండక్కి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇక క్రిస్మస్ కు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా రావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యంతో వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్‌ హీరోయిన్లుగా నటించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే పోటీకి అర్హులు

Advertisement

తాజా వార్తలు

Advertisement