Saturday, April 27, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక: వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే పోటీకి అర్హులు

హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఖరారు కావడంతో కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మార్గదర్శకాలను విడుదల చేశారు. హుజురాబాద్ ఆర్డీవో రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఉంటారని వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరుగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 70 శాతం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ జరిగిందని.. 50 శాతం సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. ఉపఎన్నిక సందర్భంగా ప్రతిఒక్కరూ సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్, కమలాపూర్, ఇల్లంతకుంట వ్యాప్తంగా ఎన్నికల ఆంక్షలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. ఎలక్షన్ కోడ్ తక్షణమే అమలులోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పనిచేసే ఉద్యోగులకు పోలింగ్ ఏజెంట్లకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండాలని… ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు సైతం వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. లేకపోతే అనర్హత వేటు పడుతుందన్నారు. నామినేషన్‌ కోసం హాజరయ్యే అభ్యర్థులు పరిమిత సంఖ్యలో రావాలని, వారు తప్పనిసరిగా కోవిడ్ ఆంక్షలు పాటించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement