Thursday, April 25, 2024

చిరు, పవన్ కూడా నాకే ఓటు వేస్తారు: మంచు విష్ణు..

‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు, అతని ప్యానెల్ సభ్యులు నేడు నామినేషన్ దాఖలు చేశారు.  తన నివాసం నుంచి ఫిల్మ్‌ ఛాంబర్‌ వరకు భారీ ర్యాలీతో ఆయన ఫిల్మ్‌ ఛాంబర్‌కు వెళ్లిన విష్ణు..అక్కడ దాసరి నారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానల్‌ సభ్యులు కూడా నామినేషన్‌ వేశారు. ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలను అందచేశారు. ఈ క్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ, హాట్ కామెంట్స్ చేశారు.

‘ఈ రోజు మా ఎన్నికల్లో మా ప్యానెల్ సభ్యులం అందరం నామినేషన్లు వేసాము. 10న ఎన్నికలు జరుగుతాయి.. మేము గెలుస్తామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నాము. ఇది ప్రతి తెలుగు నటుల ఆత్మగౌరవ పోరాటం.. నా వెనుక జగన్ గారు వున్నారు అని మీడియానే రాస్తుంది. నాకు 900 మంది సభ్యుల మద్దతు వుంది. నా మ్యానిఫెస్టో చూసిన తరువాత చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేస్తారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నాన్న గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ కోసం మాట్లాడిన మాటలు నేను ఏకిభవించటం లేదు. నేను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైపు వున్నాము. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వున్నాము.. ఛాంబర్ తీసుకున్న స్టాండ్ కు మేము కట్టుబడి వున్నాము. మరి ప్రకాష్ రాజ్ గారు ఎవరి వైపు వున్నారో చెప్పమనండి’ అంటూ మంచు విష్ణు కామెంట్స్ చేశారు.

ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ మా అధ్యక్ష పదవికి నామినేషన్‌ సమర్పించిన సంగతి తెలిసిందే.  అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. 

ఇది కూడా చదవండి: సిరిసిల్ల కలెక్టరేట్‌లోకి భారీగా వరద నీరు.. కార్యాలయం చిక్కుకున్న కలెక్టర్

Advertisement

తాజా వార్తలు

Advertisement