Monday, April 29, 2024

ఆర్ఆర్ఆర్ అజయ్ దేవగన్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ !!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా నటిస్తున్నారు. అయితే అజయ్ దేవగన్ పాత్రకు సంబంధించి ఇటీవల దర్శకనిర్మాతలు లుక్ ని కూడా విడుదల చేశారు.

అయితే అజయ్ రోల్ ఎప్పుడూ ఉంటుంది… ఎంత సేపు ఉంటుంది… అనేది దాని పై లేటెస్ట్ గా ఓ వార్త బయటకు వచ్చింది. రాజమౌళి సినిమాలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఫ్లాష్ బ్యాక్ లోనే అజయ్ పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అక్టోబర్ 13 వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement