Thursday, April 25, 2024

సోనూసూద్ ని అప్పుడు తిరస్కరించారు..కాని ఇప్పుడు..‌

ఒకప్పుడు త‌న‌ని తిరస్క‌రించిన ఓ ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ ఇప్పుడు త‌న ఫొటోని ప్ర‌చురించ‌డంపై ఆనందాన్ని వ్య‌క్తం చేశారు న‌టుడు సోనూసూద్‌. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఆ సంస్థ‌కి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ‘గతంలో స్టార్ డ‌స్ట్ ఆడిష‌న్ కోసం కొన్ని ఫొటోల్ని పంపించాను. న‌న్ను తిరస్క‌రించారు. కానీ, ఇప్పుడు అదే మ్యాగ‌జైన్‌పై నా ఫొటో ప్ర‌చురించినందుకు వారికి కృత‌జ్ఞ‌తలు చెప్పాల‌నుకుంటున్నాను’  అని ట్వీట్ చేశారు సోనూ. 2021 ఏప్రిల్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై సోనూ ఫొటోని ప్ర‌చురించి..   రియ‌ల్ హీరో సోనూ సూద్ అని కొనియాడింది స్టార్ డ‌స్ట్‌. ముంబ‌యి వేదిక‌గా 1971 నుంచి ప్ర‌చురిత‌మ‌వుతోంది స్టార్ డ‌స్ట్ మాస ప‌త్రిక‌.

కొవిడ్ ఫ‌స్ట్ వేవ్ నుంచి అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూనే ఉన్నారు సోనూసూద్‌. సెకండ్ వేవ్‌లో ఆయ‌న సేవ‌లు మ‌రింత విస్తృత‌మ‌య్యాయి. ఆక్సిజ‌న్  ప్లాంట్లు నెల‌కొల్పి,  దేశ‌మంత‌టా ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు ఉచితంగా అందిస్తూ ప్రాణ‌దాత అనిపించుకుంటున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement