Tuesday, April 30, 2024

ఆర్జీవీ బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామా “వ్యూహం” ట్రైలర్ 2 రిలీజ్..

అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే తన “వ్యూహం” సినిమా రిలీజ్‌ను కూడా ఎవరూ అడ్డుకోలేరని గతంలోనే చెప్పానని గుర్తుచేశారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ఆర్జీవీ “వ్యూహం” సినిమాను రూపొందించారు.

ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇక, ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా.. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. సెన్సార్ అడ్డంకులు దాటుకున్న వ్యూహం సినిమా క్లీన్ యూ సర్టిఫికెట్‌తో ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇవాళ వ్యూహం సినిమా ట్రైలర్ 2 ను రిలీజ్ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement