Monday, April 29, 2024

భళా తందనాన రెగ్యులర్ షూట్ స్టార్ట్

చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భళా తందనాన. కిరణ్ కొర్రపాటి సమర్పణలో రజిని కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపాలని మొదట ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా అదేది కుదరలేదు.

తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కేథరిన్ హీరోయిన్ గా నటిస్తుండగా… కేజిఎఫ్ రామచంద్రరాజు విలన్ గా నటిస్తున్నారు. అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement