Sunday, March 24, 2024

షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కు గాయాలు

సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. చెన్నైలో జరుగుతున్న షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కు గాయాలయ్యాయి. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు ప్రకాష్ రాజ్. కింద పడ్డాను ….చిన్న ఫ్రాక్చర్ అయింది. హైదరాబాద్ కి వస్తున్నాను… నా స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి సర్జరీ చేస్తారు. అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అంటూ ట్వీట్ చేశారు.

కాగా ఇటీవల మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకాష్ రాజ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే తన ప్యానల్ ని కూడా ప్రకటించారు ప్రకాష్ రాజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement