Thursday, May 2, 2024

రవితేజ ‘రావణాసుర’ ఓటీటీ పార్టనర్​ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

టాలీవుడ్ స్టార్ హీరొ మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. రవితేజ నటించిన ధమాకా, వాల్తేర్ వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ల తరువాత ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామ, రవితేజ సొంత ప్రొడక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. కలెక్షన్ల పరంగా భారీగానే రాబడుతున్నట్టు సమాచారం. ఇలా వరుస సినిమాలతో హాట్రిక్ కొట్టిన రవితేజ ప్రస్తుతం తన దూకుడును కనబరుస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన విషయం వైరల్ అవుతుంది. రావణాసుర సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియోస్’ వారు భారీ ధరలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత అమెజాన్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్టు సినీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ విషయం గురించి అమెజాన్ కూడా అధికారక ప్రకటన చేయునంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement