Sunday, April 28, 2024

రవితేజ స్టార్ట్ చేస్తున్నాడు!!

లేటెస్ట్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. అలాగే ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా శరత్ మండవ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఓకే చేశాడు రవితేజ. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

అయితే ఈ సినిమాలో రవితేజ ను ఇంతవరకు ఎప్పుడూ చూడని విధంగా సరికొత్త పాత్రలో శరత్ చూపించబోతున్నారట. అలాగే రవితేజ సరసన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 1 నుంచి హైదరాబాదులోని ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ లో స్టార్ట్ కానుందట. ఇక ఈ షెడ్యూల్ లో యూనిట్ మొత్తం పాల్గొనబోతున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement