Monday, April 29, 2024

కరోనా వైరస్ ఎఫెక్ట్ – రవితేజ సినిమాకి బ్రేక్

దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీలో మీద పడింది. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ లను వాయిదా వేసుకుంటున్నాయి. మరికొన్ని సినిమాలు షూటింగ్ లను కూడా నిలిపివేసుకుంటున్నాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.

కాగా ఈ రోజు నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరగాల్సి ఉండగా… కరోనా కేసులు దృష్ట్యా వాయిదా వేశారు. ఈ ప్రభావం తగ్గాకే ప్రారంభించాలని నిర్మాత చెరుకూరి సుధాకర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనితో పాటు రవితేజ ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement