Saturday, May 11, 2024

రావు రమేష్ డిమాండ్ గట్టిగానే చేస్తున్నాడు

ప్రముఖ నటుడు రావు రమేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు రావురమేష్. అయితే రావు రమేష్ కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది మరేదో కాదు. రావు రమేశ్ రెమ్యునరేషన్. రావు రమేష్ ప్రస్తుతం మలయాళం లోని సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న నాయట్టు రీమేక్ లో కీలక పాత్రలో కనిపించనున్నారు.

అయితే ఈ సినిమా కోసం రావు రమేష్ కోటి రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. ఎక్కువగా కాల్ సీట్స్ ఇవ్వాల్సి ఉండటమే… ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రావు రమేష్ స్టార్స్ కు సమానంగా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement