Sunday, April 28, 2024

80ఏళ్లు వ‌చ్చినా రొమాన్స్ చేస్తా.. రాణీముఖ‌ర్జీ

ఒక‌ప్పుడు బాలీవుడ్ న‌టులు షారుక్ ఖాన్..రాణీ ముఖ‌ర్జీ జంట‌గా స్క్రీన్ పై క‌నిపిస్తే అరుపులు కేకలే.. వీరు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో కుచ్ కుచ్ హోతా హై, చల్తే చల్తే, పహేలీ, కభీ అల్విదా నా కెహ్నా.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక రాణీముఖర్జీ ప్రస్తుతం విమెన్ సెంట్రిక్ మూవీస్ కే పరిమితం అవ్వగా.. షారుఖ్ మాత్రం ఇంకా కుర్రాడిలా మెరిసిపోతున్నాడు.. 60 ఇయర్స్ కు దగ్గరలో ఉన్నా.. సిక్స్ ప్యాక్ తో అమ్మాయిల మనసు దోచేస్తున్నారు. షారుఖ్, రాణి ముఖర్జీ మధ్య మొదటి నుంచీ మంచి స్నేహం ఉంది.రీసెంట్ గా రాణి ముఖర్జీ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే అనే ఓ సినిమాలో నటించింది. ఈమూవీ రిలీజ్ అయ్యి మంచి సక్సెసె సాధించింది. దాంతో రాణీ ముఖర్జీతో పాటు..మూవీ టీమ్ అంతంటిని అభినందిస్తూ.. షారుఖ్ ట్వీట్ కూడా చేశారు. ఈ సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో రాణి ముఖర్జీ షారుఖ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మీడియా ప్రతినిథులు షారుఖ్ ఖాన్ గురించి అడగడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రాణీ ముఖర్జీ. రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. నేను రైటర్స్ కి ఇప్పుడే చెప్తున్నాను, మంచి లవ్ స్టోరీ, ఒక మెచ్యూర్ లవ్ స్టోరీతో వ‌స్తే నేను రెడీనే.. అని చెప్పింది రాణీ. నాకు 80 ఏళ్ళు వచ్చినా షారుక్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధ‌మ‌ని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement