Sunday, April 28, 2024

ఆచార్య, సిద్ధ…లుక్ అదిరిపోయింది

మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. అయితే ఈరోజు చరణ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చిరంజీవి, చరణ్ లు ఇద్దరూ తుపాకీలు పట్టుకుని నడుచుకుంటూ వస్తూ కనిపించారు.

ప్రస్తుతం ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇక ఈ సినిమాను మ్యాట్నీ మూవీస్ తో కలిసి చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement