Thursday, May 16, 2024

రామారావు ఆన్ డ్యూటీ – రిలీజ్ డేట్ పై సందిగ్థ‌త‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. కాగా ఆయ‌న న‌టిస్తోన్న చిత్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ కూడా ఒక‌టి. ఈ మూవీని మార్చి 25న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్. అయితే ఈ రిలీజ్ డేట్ మారేట‌ట్టుక‌నిపిస్తోంది. ఈ డేట్ కి రిలీజ్ కాక‌పోతే.. ఏప్రిల్ 15న రిలీజ్ కానుంద‌ని తెలిపారు. ఈ చిత్రాన్ని శ‌ర‌త్ మండ‌వ తెర‌కెక్కిస్తున్నాడు. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. .దివ్యాన్ష .. రజీషా విజయన్ హీరోయిన్స్. నాజర్ .. నరేశ్ .. తనికెళ్ల భరణి .. పవిత్ర లోకేశ్ .. ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక రవితేజ నటించిన ‘ఖిలాడి’ ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement