Saturday, April 27, 2024

ఆర్ఆర్ఆర్ – ఉగాది కనుక అదిరిపోయింది

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నారు, ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన వీడియోలు కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ రాంచరణ్ ను ప్రజలంతా హర్షధ్వానాలతో పైకెత్తి జేజే లు కొడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పోస్టర్ ని పోస్ట్ చేస్తూ దర్శకధీరుడు రాజమౌళి హ్యాపీ ఉగాది టు ఆల్ అంటూ రాసుకోచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement