Thursday, May 2, 2024

ఉగాది స్పెషల్ – విరాటపర్వం నుండి సాయి పల్లవి న్యూ లుక్

వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. 1990 కాలం నాటి నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే నివేదా పేతురాజ్, నందితాదాస్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా… తాజాగా ఉగాది సందర్భంగా పల్లవి కి సంబంధించిన మరో కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ లో లంగా ఓణీ లో సాయి పల్లవి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్టు పెడుతూ కనిపించింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 30 న థియేటర్స్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement