Sunday, April 28, 2024

వేడి పుట్టిస్తున్న రకుల్ బికినీ షో – వీడియో తో

అందాల తార రకుల్‌ ప్రీత్ సింగ్‌ ఓ థెరపీని తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ థెరపీకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ థెరపీ ఏంటి.? రకుల్‌ ఇలా చేయడానికి కారణమేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే రకుల్‌ పోస్ట్ చేసిన వీడియోలో మొదట బికినీలో దర్శనమిచ్చింది. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండి, కొంత మేర నీరు ఉన్న ఓ చిన్న కొలనులోకి వెళ్లి.. పూర్తిగా నీటిలో మునక వేసింది. అనంతరం నీటిలో నుంచి బయటకు వచ్చేసింది

సాధారణంగా మనం వ్యాధులను నయం చేసుకోవడానికి వైద్యులు సూచించిన వైద్య చికిత్సను ఫాలో అవుతుంటాం. అయితే సెలబ్రిటీలు, క్రీడకారులు మాత్రం ఇందుకోసం కొన్ని రకాల థెరపీలను వాడుతుంటారు. ఎలాంటి మెడికేషన్‌ తీసుకోకుండా కొన్ని రకాల పద్ధతుల ద్వారా వ్యాధిని నయం చేసుకోవడమే ఈ థెరపీల ముఖ్య ఉద్దేశం. శరీరంలో కణజాల గాయాలకు చికిత్స చేయడానికి క్రియోథెరపీని ఉపయోగిస్తారు. చాలా తక్కువ ఉష్ణోగ్రత నీటిలో స్నానం చేయడం వల్ల కణజాలల గాయలను తగ్గించుకోవచ్చు. మైగ్రేన్‌ లక్షణాలు, గాయాలు మానిన తర్వాత వచ్చే నొప్పి, ఆర్థరైటిస్‌ నొప్పులు, అల్జీమర్స్‌, కొన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో ఈ థెరపీని ఉపయోగిస్తుంటారు. థెరపీని రకుల్ చేసి వీడియో పోస్ట్ చేసింది మీరూ ఆ వీడియో ను చూసేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement