Saturday, March 2, 2024

గ్రూప్‌-4 అభ్యర్థులకు ఎడిట్‌ ఆప్షన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షను జులై 1వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే పలువురు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులు చేయడంతో అభ్యర్థుల వినతుల మేరకు తమ దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు టీఎస్‌పీఎస్‌సీ అవకాశం కల్పించింది. ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో జరిగిన తప్పులను సరిచేసుకోవాలని సూచించింది. అభ్యర్థులకు ఇదే చివరి అవకాశంగా అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement