Tuesday, May 7, 2024

Rakul: యోగాస‌నాల‌తో మ‌ళ్లీ రాజ‌యోగం వ‌స్తుందా రకుల్ …

టాలీవుడ్ లోని యంగ్‌ హీరోల్లో దాదాపు అందరితో సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్. ఈ అమ్మడు టాలీవుడ్‌ తో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్‌ లకు కూడా నో చెప్పింది.

టాలీవుడ్‌ లో ఆఫర్లు తగ్గడంతో బాలీవుడ్ వైపు వెళ్లింది. అక్కడ రెండేళ్ల పాటు సందడి చేసింది. సినిమాల ద్వారా వార్తల్లో నిలువకున్నా కూడా సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా వార్తల్లో ఉంటూనే ఉంది. తన అందమైన ఫోటోలను షేర్‌ చేసే రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఈసారి యోగాసనాలు వేసిన ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందమైన రకుల్‌ ప్రీత్ సింగ్ చాలా కష్టతరమైన యోగ ఆసనాలు వేయడం ద్వారా చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుందని కొందరు అంటున్నారు.

చూడ్డానికి చాలా సుకుమారంగా, సున్నితంగా కనిపించే ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భలేగా యోగాసనాలు వేసిందే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫిజిక్ కోసం ఇంత కష్టపడుతున్న రకుల్‌ కి మళ్లీ సినిమాల్లో ఆఫర్లు వస్తే బాగుండు అన్నట్లుగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement