Thursday, April 25, 2024

హార‌ర్ కామెడీ జాన‌ర్​లో ‘రాజా డీల‌క్స్’

ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్టర్​గా ‘రాజా డీలక్స్’ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారట‌. ఈ సినిమా కోసం భారీ సెట్స్ ని కూడా రెడీ చేస్తున్నార‌ట‌. ఎక్కువ భాగం షూటింగ్ ఈ సెట్ లోనే జరుగుతుందని అంటున్నారు. ఆ సెట్ కోసమే పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథాంశంపై డైరెక్టర్​ మారుతి కసరత్తు చేస్తున్నారు.

కాగా, ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం 40 రోజులు మాత్రమే కేటాయిస్తున్నాడని, దానికి తగ్గట్టుగానే తన పార్ట్ పూర్తి చేస్తాడని సమాచారం. సినిమా కోసం అతను రచయితలు, దర్శకుల నుండి సలహాలను తీసుకున్నట్లు సమాచారం. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement