Monday, April 29, 2024

రామ్ కి బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన.. పూరీ జ‌గ‌న్నాథ్

నేడు హీరో రామ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తోంది. . ఒక రోజు ముందు సీక్వెల్ ప్రకటించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆయనకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ సినిమా2024 మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం రామ్.. బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వెళుతుంది. ఈ చిత్రం హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి తెలియాల్సి ఉంది. పూరి, చార్మి నిర్మాతలుగా పూరి కనెక్ట్స్ బ్యానెర్ పైనే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement