Saturday, April 27, 2024

ఆర్ఆర్ఆర్ పై నిర్మాత కొత్త అనౌన్స్మెంట్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్,అలియా భట్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగ్ లు నిలిచిపోయినట్టే ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.

అయితే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో చాలా వరకు సినిమాలు షూటింగ్ ని రీస్టార్ట్ చేస్తున్నాయి. కాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ రీస్టార్ట్ పై నిర్మాత డివివి దానయ్య ఓ క్లారిటీ ఇచ్చారు. ఓ ప్రింట్ మీడియాతో డి.వి.వి.దానయ్య చెప్పిన మాటల ప్రకారం కేవలం ఇంకా రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉందని అది పూర్తయితే షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు. అంతేకాకుండా ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ నెలాఖరు నుంచి స్టార్ట్ చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement