Monday, May 6, 2024

మరో సూపర్ హిట్ మూవీ రీమేక్ కు ప్రియమణి గ్రీన్ సిగ్నల్ ?

హీరోయిన్ ప్రియమణి గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. యమదొంగ సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైంది ఈ అమ్మడు. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో, రగడ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఇక ప్రస్తుతం వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో నటిస్తోంది ప్రియమణి. అలాగే విరాటపర్వం సినిమాలో కామ్రేడ్ భారతక్క గా నటిస్తోంది. అలాగే ఇటీవలే ప్రియమణి నటించిన ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్2 రిలీజ్ అయింది.

కాగా తాజాగా ప్రియమణి మరో సినిమా చేయడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కన్నడలో సూపర్ హిట్ అయిన లేడీ ఓరియంటెడ్ మూవీ యాక్ట్ 1978 సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఠాగూర్ మధు ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. గర్భవతి అయిన ఒక మహిళ ప్రభుత్వం నుంచి తనకి రావాల్సిన నష్టపరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోతుంది. చివరికి మానవ బాంబుగా మారి ఆఫీస్ కి వెళ్లి ఎవరు బయటికి వెళ్లకుండా చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ కథ.

Advertisement

తాజా వార్తలు

Advertisement