Friday, May 3, 2024

రికార్డుల రారాజు రొనాల్డో..

పోర్చుగ‌ల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మాంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్ప‌టికే 2020 యూరోక‌ప్‌లో అత్య‌ధిక గోల్స్ చేసిన ఈ స్టార్ ప్లేయ‌ర్‌.. ఇప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుట్‌బాల్‌లో అత్య‌ధిక గోల్స్ వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేశాడు. బుధ‌వారం ఫ్రాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన అత‌డు.. ఇన్నాళ్లూ ఇరాన్‌కు చెందిన అలీ డేయీ పేరిట ఉన్న రికార్డును స‌మం చేయ‌గ‌లిగాడు. ప్ర‌స్తుతం రొనాల్డో 109 గోల్స్‌తో అలీతో క‌లిసి టాప్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్ డ్రా కావ‌డంతో పోర్చుగ‌ల్ నాకౌట్‌లోకి ప్ర‌వేశించింది.ఇదే టోర్నీలో పోర్చుగ‌ల్ క‌నీసం మ‌రో మ్యాచ్ ఆడుతుండ‌టంతో రొనాల్డో కొత్త వ‌రల్డ్ రికార్డు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్ప‌టికే యూరో 2020లో అత‌డు టాప్ స్కోర‌ర్‌గా ఉన్నాడు. మూడు మ్యాచ్‌ల‌లో ఐదు గోల్స్ చేశాడు. అంతేకాదు ఓవ‌రాల్‌గా యూరోలో అత్య‌ధిక గోల్స్ రికార్డు కూడా అత‌ని పేరిటే ఉంది. మొత్తం 14 గోల్స్‌తో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement