Friday, April 26, 2024

రాజా డీలెక్స్ సెట్ నుంచి లీక్ అయిన ప్రభాస్ న్యూ లుక్ !

రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ రాజా డీలక్స్ అని సోషల్ మీడియాలో కొన్ని రోజులు వైరల్ అయింది.. అయితే ఇది ఇంకా అధికారికంగా కన్ఫామ్ కాలేదు. అయితే, ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఈ మూవీ నుంచి ప్రభాస్‌ న్యూ లుక్ ఫోటోలు లీకై అయ్యాయి. లీక్ అయిన ఫోటోలలో ప్రభాస్‌ కొత్త లుక్‌లో చూసిన అభిమానులు సంతోషంతో తెలిపోతున్నారు. చాలా రోజులుగా ప్రభాస్ సినిమాలపై ఎలాంటి అప్డేట్స్ కూడా రావడంలేదు, దీంతో ప్రస్తుతం లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమ అభిమాన హీరోను ఇంత బాగా చూపించినందుకు దర్శకుడు మారుతికి కృతజ్ఞతలు తెలిపుతున్నారు ప్రభాస్ అభిమానులు.

అయితే ఈ సినిమా నుంచి ఇదివరకు కూడా ప్రభాస్ పిక్స్ లీక్ అయ్యాయి.. కాగా, ఇప్పుడు మరోసారి ఈ మూవీ నుండి ప్రభాస్ కొత్త లుక్ ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడంతో ఈ ఫోటోలకు సంచలన స్పందన వస్తోంది. లీకైన పిక్‌లో ప్రభాస్ దుస్తులు, పొడవాటి జుట్టు, గడ్డం, ప్రతిదీ చాలా బాగుంది.

- Advertisement -

కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో ప్రభాస్ తాతగా, మనవడిగా ద్విపాత్రాభినయం చేయనున్నాడని సినీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇప్పుడు కొత్తగా లీకైన పిక్స్‌తో ఈ సిినిమాలో రిద్ధి కుమార్ కూడా భాగం కానుందని స్పష్టం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement