Monday, May 6, 2024

KKR vs SRH | హ్యారీ బ్రూక్ సెంచరీ.. కెకెఆర్ కు భారీ టార్గెట్

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో కదం తొక్కాడు. ఐపీఎల్ 2023లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్రూక్ 55 బంతుల్లో 100 కొట్టి నాటౌట్ గా నిలిచాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ కు ఐపీఎల్ లో ఇది తొలి సెంచరీ కావడం విశేషం.

ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో నమోదైన తొలి సెంచరీ కూడా ఇదే. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 26 బంతుల్లో అర్ధ శతకంతో రాణించాడు. అభిషేక్ శర్మ 17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఆండ్రీ రస్సెల్ కు మూడు వికెట్లు దక్కాయి.

- Advertisement -

సన్‌రైజర్స్ హైదరబాద్ : మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ (కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్, మార్కో జాన్సెన్.

ఇంపాక్ట్ ప్లేయర్స్ : సమద్, వివ్రాంత్, ఫిలిప్స్, దగర్, సుందర్

కోల్‌కతా నైట్‌రైడర్స్ : నితీశ్ రాణా (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, జగదీశన్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దుల్ ఠాకూర్, నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్, ఫెర్గూసన్, సుయాశ్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్స్ : వెంకటేశ్ అయ్యర్, మన్ దీప్, అనుకుల్, వీస్, ఖేజ్రోలియా

Advertisement

తాజా వార్తలు

Advertisement