Monday, April 29, 2024

ప్రభాస్ కొత్త కారు అదిరిపోయింది…ధర ఎంతో తెలుసా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధే శ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు నాగ్ అశ్విన్ తో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ కారును కొనుగోలు చేశాడట. దీని ధర సుమారు 5.6 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. కాగా ప్రభాస్‌కు ఇప్పటికే బీఎమ్‌డబ్ల్యూ 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్‌ ఎక్స్‌జేఎల్‌ కార్లు ఉన్నాయట. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో ఖరీదైన కారు చేరింది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ కారు గత రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement