Sunday, April 28, 2024

ఏసియాలోనే ప్రభాస్ నెంబర్ వన్..

బాహుబ‌లి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ తీస్తున్న ప్రతి సినిమా కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ లెవల్ లోనే వస్తున్నాయి.. అయితే తాజాగా ప్రభాస్ ఫాలోయింగ్ కు అద్దంపట్టేలా ఓ అరుదైన్ గుర్తింపు దక్కించుకున్నాడు…ఫ్యాన్సీ ఓడ్స్ ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియ‌న్ మ్యాన్’ లిస్ట్‌లో టాప్ వ‌న్ ప్లేస్ లో నిలిచాడు. భూమిపై అతి పెద్ద ఖండ‌మైన ఆసియాలోనే అత్యంత హ్యాండ్సమ్ మ్యాన్ గా ప్ర‌భాస్ నిలిచాడ‌న్న వార్త‌తో వ‌ర‌ల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు ఎక్జయిటింగ్ కు లోన‌వుతున్నారు. ఇక ప్రభాస్ తరువాతి స్థానంలో పాకిస్థాన్ న‌టుడు, సింగ‌ర్, నిర్మాత ఇమ్రాన్ అబ్బాస్ న‌ఖ్వి ఈ జాబితాలో రెండో స్థానం కొట్టేశాడు. పాపుల‌ర్ ఇండియ‌న్ టీవీ న‌టుడు వివియ‌న్ డిసేన ఏడో స్థానంలో నిలిచాడు. బాహుబ‌లి త‌ర్వాత పాన్ ఇండియా క‌థాంశాల‌పై ఫోక‌స్ పెట్టాడు ప్ర‌భాస్‌. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ చిత్రం రాధేశ్యామ్ లో న‌టిస్తోండ‌గా..విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది. మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో స‌లార్, నాగ్ అశ్విన్ తో ఓ సినిమా, ఓం రావ‌త్ తో ఆదిపురుష్ చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

ఇది కూడా చదవండి : పాండ్యాకు కరోనా.. రెండో టీ20 వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement