Monday, April 29, 2024

నీయవ్వ తగ్గేదేలే! పుష్ప 2లో పవర్​ఫుల్​ విలన్​.. ఐటమ్​ సాంగ్​కోసం దిశా సెలక్షన్​

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ పుష్ప 2 త్వ‌ర‌లో సెట్స్ మీద‌కి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ పార్టుతో పాటు సెకండ్ పార్టులోను ఫారెస్ట్ ఆఫీసర్ గా ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నారు. అయితే.. సెకండ్ పార్ట్ లో మరో పవర్​ఫుల్​ పోలీస్ ఆఫీసర్ గా సీనియర్ స్టార్ హీరోను పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నన్నట్టు తెలుస్తోంది.

ఆ సీనియర్ స్టార్ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్​లో ఒకప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేసిన సునీల్ శెట్టి. ఈ మ‌ధ్య కాలంలో ఈయ‌న‌ తెలుగులోనూ ముఖ్యమైన రోల్స్ చేస్తూ క‌నిపిస్తున్నారు. ఇక ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం కూడా ఆయనను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ పాత్రను సుకుమార్ డిఫరెంట్ గా డిజైన్ చేశారని చెబుతున్నారు. ఇక.. రష్మిక కథానాయికగా నటించే ఈ సినిమాలో, దిశా పటాని కూడా కనిపించి మురిపించనున్నట్టు సమాచారం. స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్నట్టు ఫిలింనగర్​ వర్గాల సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement