Monday, April 29, 2024

ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లభర్తీకి నోటిఫికేషన్… 26వ తేది ఒంటి గంట వరకు

వరంగల్, ప్రభన్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లభర్తీకి కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం సాయంత్రం 6గంటల నుంచి, మంగళవారం మధ్యాహ్నం 1 గంటలవరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఫైనల్ మాప్ ఆప్ విడత కౌన్సిలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను స్ట్రేవెకెన్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీట్ల ఖాళీల వివరాలు వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు వెల్లడించింది.

ఇప్పటికీ యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన విద్యార్థులు ఈ విడత వెబ్ కౌన్సిలింగ్ లో పాల్గొనవచ్చని తెలిపింది. గత విడత కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయిన చేరి డిస్ కంటిన్యూ చేసిన అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరినా విద్యార్థులతో పాటు ఎన్ టీ ఆర్ యు హెచ్ ఎస్ లో సీటు పొందిన విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ కు అనర్హులుగా పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement