Saturday, March 23, 2024

Breaking: 16 యూట్యూబ్ చాన‌ళ్ల‌ను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకంటే..

జాతీయ భ‌ద్ర‌త‌, విదేశీ సంబంధాలు, ప‌బ్లిక్ ఆర్డ‌ర్‌కు సంబంధించి త‌ప్పుడు స‌మాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయ‌నే కార‌ణంతో 16 యూట్యూబ్ చాన‌ళ్ల‌ను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల బ్లాక్ చేసింది. ఈ మేర‌కు కేంద్ర‌ స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇందులో ప‌ది భార‌తీయ‌, ఆరు పాకిస్తాన్ యూట్యూబ్ చాన‌ళ్లున్నాయ‌ని పేర్కొంది.

‘ఈ యూట్యూబ్ ఛాన‌ళ్లు ప్ర‌జ‌ల్లో భయాందోళనలను సృష్టించేలా.. పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించేలా తప్పుడు, ధ్రువీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ బ్లాక్ చేసిన యూట్యూబ్ చాన‌ళ్ల‌కు 68 కోట్ల‌కు పైగా స‌బ్‌స్క్రైబ‌ర్లున్నారు.’ అని కేంద్ర స‌ర్కారు పేర్కొంది. కాగా, ఈ నెల ప్రారంభంలోనూ కేంద్ర స‌ర్కారు ఇదే కార‌ణంతో 22 యూట్యూబ్ చాన‌ళ్ల‌ను బ్లాక్ చేసింది. ఇందులో నాలుగు పాకిస్తాన్‌కు చెందిన చాన‌ళ్లుకాగా, మిగ‌తా 18 భార్‌త్‌కు చెందిన‌వి.

Advertisement

తాజా వార్తలు

Advertisement