Thursday, May 2, 2024

మరో రిమేక్​కి రెడీగా పవర్​స్టార్​.. తమిళ మూవీ తేరికి గ్రీన్​ సిగ్నల్​..

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ కల్యాణ్ వరుస రీమేక్ ల‌తో భారీ హిట్ లు సొంతం చేసుకుంటున్నారు.. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ .. ‘భీమ్లా నాయక్’ రీమేక్ లతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. తాజాగా మరో రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలింనగర్​ వర్గాల నుంచి టాక్ వినిసిస్తోంది. తమిళంలో విజయ్ చేసిన ‘తేరి’ సినిమాకి ఇది రీమేక్ అంటున్నారు సినీ విశ్లేషకులు. విజయ్, సంమంత జంట‌గా న‌టించిన ‘తేరి’ సినిమా తమిళంలో మంచి విజయాన్నే దక్కించుకుంది.

అయితే.. ఆ మూవీ రీమేక్ కోసం పవర్​ స్టార్​ పవన్ ను ఒప్పించింది ‘సాహో’ దర్శకుడు సుజీత్ అంటూ కొంత గాసిప్​ వినిపిస్తోంది. ‘సాహో’వంటి భారీ సినిమాను చాలా చిన్న వయసులోనే హ్యాండిల్ చేశాడనే పేరు సుజీత్ కి ఉంది. ఆ తర్వాత కొన్నికథలపై కూడా ఆయన కసరత్తు చేసి.. ‘తేరి’ రీమేక్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. హరీశ్ శంకర్.. సురేందర్ రెడ్డి ప్రాజెక్టుల తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు సినీ విశ్లేష‌కులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement