Friday, May 17, 2024

రహ‌దారుల అనుసంధానంతో ఖ‌మ్మంను అభివృద్ధి చేయండి.. కేంద్రానికి ఎంపీ నామా లేఖ‌

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోని భౌగోళిక ప్రాముఖ్యత ఉన్న రెండు రహాదారులను మెరుగైన అనుసంధానం కోసం జాతీయ రహదారులుగా మార్చాలని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. ఇటీవల నామా నాగేశ్వ ర్‌రావు ప్రత్యేక చొరవతో సీఆర్ఎఎఫ్ పథ‌కం కింద‌ జిల్లాలో వైరా, పాలేరు నియోజకవర్గాల్లో రెండు రోడ్లకు గామ 35 కోట్ల నిధులు విడుదల అయిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాకు మరిన్ని రోడ్లు మంజూరు చేయాలని అందులో భాగంగా జగ్గయ్యపేట- వైరా-తల్లాడ-కొత్తగూడెం నుంచి సుమారు 120.00 కిమీ పొడవు జాతీయ ర‌హ‌దారి (ఎన్ హెచ్)-65 ( హైదరాబాద్ – విజయవాడ సెక్షన్ ), ఎన్ హెచ్-30 ( విజయవాడ జగ్దల్పూర్ సెక్షన్ ) ఎన్ హెచ్ -365 బిని అనుసంధానిస్తుందని గుర్తు చేశారు.

కొత్తగూడెం, పాల్వంచ, సారపాకలోని జగ్గయ్యపేట వద్ద ఉన్న ప్రధాన సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇది చాలా ముఖ్యమైన లింక్ రోడ్ అవటంతో ట్రాఫిక్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఈ రోడ్లను ఎన్ హెచ్ లు మార్చితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సుగుమం అవటంతో పాటుగా ఇంటర్ కనెక్షన్ కారణంగా ఖమ్మం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు త్వరితగతిన చేరుకోవచ్చుని గుర్తు చేశారు. భద్రాచలం-అశ్వారావుపేట సెక్షన్ 2017లో ఎన్  హెచ్‌ను మార్చడానికి కేంద్ర ర‌వాణా శాఖ ఇదివ‌ర‌కే సూత్రప్రాయంగా ఆమోదించింద‌ని తెలిపారు. కానీ కొన్ని అలైన్మెంట్ సాధ్యాసాధ్యాల కారణాల వల్ల ప్రతిపాదన పెండింగ్‌లో ఉంద‌ని వ్యాఖ్యానించారు.

భద్రాచలం నుంచి అశ్వారావుపేట(వయా) బూర్గంపాడ్, వెంకటాపురం, ముల్కలపల్లి, దమ్మపేట వరకు 84.00 కి.మీ ఈ స్ట్రెచ్‌ను ఎన్ హెచ్ మార్చి అభివృద్ధి చేయాల‌న్నారు. దాంతో ఎన్.హెచ్-30 (భద్రాచలం వద్ద), ఎన్ హెచ్-366 ఏబిలను అశ్వారావుపేటలో అనుసంధానం చేయడం వల్ల అంతర్గత గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంద‌ని నొక్కి చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ బోర్డర్ చత్తీస్‌ఘ‌డ్‌లోని పారిశ్రామిక ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలకు దూరంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు మధ్య దూరాలు తగ్గుతాయని తెలిపారు. ఈ రహదారులు జాతీయ  రహదారుల గల మార్చడం వల్ల దూరం తగ్గి , సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు. దీని నిర్మాణంతో సరుకు రవాణా కష్టాలు కూడా తీరుతాయని ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అభిప్రాయ‌ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement