Friday, May 3, 2024

బర్త్ డే‌కి మొక్కలు నాటండి.. అభిమానులకు మహేష్ పిలుపు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యాన్స్ ను ఒక కోరిక కోరారు. ప్రతి ఒక్కరూ తన పుట్టిన రోజునాడు మూడు చెట్లు నాటాలని నా మీద ఉన్న ప్రేమతో మీరు చేసే పనులన్నీ నాకు ఎంతగానో ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నాయని చెప్పుకొచ్చారు. అందుకే నా బర్త్ డే రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లు తప్పనిసరిగా నాటాలని పిలుపునిచ్చారు.

అలాగే మొక్కలు నాటే ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయాలని అప్పుడే నేను చూడగలను అంటూ చెప్పుకొచ్చారు. సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు .

Advertisement

తాజా వార్తలు

Advertisement